బాలయ్య ఆ డైరెక్టర్ తో మూవీ కన్ఫామా?? | 123Josh.com
Home గుసగుసలు బాలయ్య ఆ డైరెక్టర్ తో మూవీ కన్ఫామా??

బాలయ్య ఆ డైరెక్టర్ తో మూవీ కన్ఫామా??

0
1131

100 పర్సెంట్ సక్సెస్ రేట్ తో వరుస విజయాలతో దూసుకుపోతూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు అనిల్ రావిపూడి… తన హిట్ సినిమా ‘F 2’కి సీక్వెల్ గా ‘F 3’ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలయ్యతో మరియు మోక్షజ్ఞతో సినిమా చేయాలనే కోరికను వెలిబుచ్చాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే బాలయ్య కోసం లైన్ రెడీ చేశానని.. అయితే ఇద్దరికీ డేట్స్ కుదరక ఇప్పటికీ అది సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు అనిల్.

వాస్తవానికి ‘సుప్రీమ్’ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేయాలని అనిల్ ట్రై చేసాడు. కానీ బాలకృష్ణ కెరీర్లో మైలురాయి 100వ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తన్నుకు పోయాడు. దీంతో మరో నందమూరి హీరోని డైరెక్ట్ చేయాలనే ఆశ నిరాశగా మిగిలిపోయింది.అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం బాలయ్య – అనిల్ రావిపూడి కాంబోలో సినిమా రాబోతోందట. ఇటీవల బాలయ్యకు అనిల్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందట. దీంతో బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ గా తన కెరీర్లో 107వ చిత్రంగా తెరకెక్కనుంది.

బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో ఏర్పడిన పరిస్థితుల వలన షూటింగ్ నిలుపుదల చేసుకుంది. కాగా ఈ సినిమా పూర్తైన తర్వాత అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈలోపు అనిల్ విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో ‘F 3’ సినిమా ఫినిష్ చేసుకుంటాడు. మొత్తం మీద అనిల్ రావిపూడి.. బాలయ్య 100వ సినిమాకి ట్రై చేస్తే 107వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికిందన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here