బాలయ్య టీసర్ వస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం ఎందుకో తెలుసా? | 123Josh.com
Home న్యూస్ బాలయ్య టీసర్ వస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం ఎందుకో తెలుసా?

బాలయ్య టీసర్ వస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం ఎందుకో తెలుసా?

0
7110

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి అదిరిపోయే గిఫ్ట్ ఇస్తాడని ఎదురు చూస్తే చివరి నిమిషంలో తుస్సుమనిపించాడు. ప్రయత్నిస్తున్నాం అంటూనే చేతులెత్తేశాడు. తారక్ ఫస్ట్ లుక్ టీజర్ అంటే దానిని ఛాలెంజింగ్ గా భావించిన రాజమౌళి అనుకున్న విజువల్స్ కుదరక పోవడంతో లుక్ రిలీజ్ చేయలేదు. అలా తారక్ బర్త్ డేని మిస్సయ్యారు ఫ్యాన్స్.

కానీ బోయపాటి మాత్రం అలా కాదు.. బాబాయ్ బాలకృష్ణ ఫస్ట్ లుక్ టీజర్ తో స్పెల్ బౌండ్ చేసేశాడు. # బిబి 3 రోరింగ్.. అదిరే బర్త్ డే గిఫ్ట్ ఇది!! అన్న ప్రశంసలు దక్కాయి. టీజర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల అంచనాలను పెంచడంలో సఫలమైంది. బాలయ్య లుక్ .. యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. మరోసారి బోయపాటి మార్క్ ఎలివేట్ అయ్యింది. బాలయ్య బాబు నుంచి ఆశించే మాస్ యాక్షన్ కి కొదవేమీ లేదని భరోసా లభించింది.

అయితే జక్కన్నకు సాధ్యం కానిది బోయపాటికి ఎలా సాధ్యమైంది. రాజమౌళి అప్పటికే ఆర్.ఆర్.ఆర్ 70 శాతం పూర్తి చేశాడు. కానీ బోయపాటి సింగిల్ షెడ్యూల్ మాత్రమే చేశాడు. కానీ టీజర్ కట్ చేయడంలో జక్కన్న తడబడితే బోయపాటి ఎలాంటి తడబాటు లేకుండా ఉన్న కొద్దిపాటి విజువల్స్ ని సమర్థంగా ఉపయోగించుకున్నాడని ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here