బాలయ్య డెడికేషన్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే!! | 123Josh.com
Home గుసగుసలు బాలయ్య డెడికేషన్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే!!

బాలయ్య డెడికేషన్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే!!

0
1227

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేశారు. ఇప్పటికే తన 105 సినిమాకు సంబంధించిన పిక్స్ ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. ఫ్రెంచ్ కట్ గడ్డంతో సన్నబడిన దేహంతో అసలు చూస్తున్నది బాలయ్యనేనా అని

అభిమానులే ఆశ్చర్యపోయేలా ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నాయి. ఇంత తక్కువ టైంలో బాలకృష్ణ ఇలాంటి లుక్ లోకి ఎలా వచ్చాడా అనే అనుమానం కలగడం సహజం.దానికి నిర్మాత సి కళ్యాణ్ క్లారిటీ ఇస్తున్నాడు. ఆయన చెప్పిన ప్రకారం బాలయ్య

రోజు ఉదయం సాయంత్రం జిమ్ లో 5 గంటల పాటు పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం కఠినమైన కసరత్తులు చేస్తున్నారట.  అందుకే ఇంత లేట్ ఏజ్ లోనూ ఇంత గ్లామర్ గా కనిపిస్తున్నారని ఓపెన్ చేశారు. అయితే ఇందులో మరో మాస్ అవతారం ఉంటుందని రౌడీ ఇన్స్ పెక్టర్ రోజులను గుర్తుకు తెస్తుందని ఇంకాస్త ఊరిస్తున్నారు కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here