బాలయ్య…సినిమా కి బోయపాటి పెట్టె టైటిల్ ఇదే!! | 123Josh.com
Home గుసగుసలు బాలయ్య…సినిమా కి బోయపాటి పెట్టె టైటిల్ ఇదే!!

బాలయ్య…సినిమా కి బోయపాటి పెట్టె టైటిల్ ఇదే!!

0
6350

బాలయ్య బర్త్ డే సందర్బంగా విడుదలైన వీడియోతోనే టైటిల్ ను ప్రకటించాలని అనుకున్నారు. అప్పటికే మోనార్క్ అనే టైటిల్ ప్రచారం జరిగింది. కాని అంతకు మించిన టైటిల్ ను పెట్టాలనుకున్నారట. కాని చివరకు మోనార్క్ నే ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఒక మంచి సందర్బం చూసి బిబి3 టైటిల్ ‘మోనార్క్’ అంటూ అధికారికంగా ప్రకటించేందుకు బోయపాటి ఏర్పాట్లు చేస్తున్నాడు. సింహా లెజెండ్ టైటిల్స్ తరహాలోనే మోనార్క్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉందనే టాక్ వచ్చింది. అందుకే బోయపాటి మోనార్క్ టైటిల్ కే ఫిక్స్ అయ్యాడని బాలకృష్ణ కూడా ఆ టైటిల్ పట్ల సంతృప్తిగా ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది.

బాలకృష్ణ వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి సమయంలో బోయపాటితో సినిమా చేస్తున్న కారణంగా నందమూరి ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. అంతా సవ్యంగా ఉండి ఉంటే ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేది. కాని షూటింగ్ కు మహమ్మారి వైరస్ ఆటంకిగా మారింది. ఈ చిత్రం సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here