బాలయ్య సినిమా బిజినెస్ “సున్నా” షాకింగ్ అప్ డేట్!! | 123Josh.com
Home న్యూస్ బాలయ్య సినిమా బిజినెస్ “సున్నా” షాకింగ్ అప్ డేట్!!

బాలయ్య సినిమా బిజినెస్ “సున్నా” షాకింగ్ అప్ డేట్!!

0
776

బాలకృష్ణ గత చిత్రాల ఫలితాలను మరియు ఈ సినిమా బజ్ ను బేరీజు వేస్తున్న ఓవర్సీస్ బయ్యర్లు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో బాలయ్య నటించిన పలు సినిమాలను ఓవర్సీస్ లో విడుదల చేయగా రిలీజ్ కు అయిన ఖర్చులు కూడా వెనక్కు రాబట్టలేక పోయాయి. ఈ ఏడాది వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు మరియు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు కూడా ఓవర్సీస్ రైట్స్ తీసుకున్న బయ్యర్లను నిండా ముంచాయి.

ఆ అనుభవంతో రూలర్ చిత్రాన్ని ఓవర్సీస్ లో కొనుగోలు చేసేందుకు ఎవరు సాహసించడం లేదు. సీడెడ్ మరియు ఇతర తెలుగు రాష్ట్రాల ఏరియాల్లో మంచి క్రేజ్ ఉన్న బాలయ్య ఓవర్సీస్ లో మాత్రం ఒకటి రెండు సార్లు తప్ప ఇప్పటి వరకు హిట్ కొట్టింది లేదు. అయినా కూడా అక్కడ తన సినిమాలను విడుదల చేస్తూనే ఉన్నాడు.

ఓవర్సీస్ లో ప్రతి సారి బాలయ్యకు నిరుత్సాహం ఎదురవుతున్న మళ్లీ రూలర్ తో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రూలర్ సినిమాను బయ్యర్లు కొనుగోలు చేయకున్నా సొంతంగా రిలీజ్ చేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here