బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమేక్ పై నితిన్ కామెంట్!! | 123Josh.com
Home గుసగుసలు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమేక్ పై నితిన్ కామెంట్!!

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమేక్ పై నితిన్ కామెంట్!!

0
1438

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘అంధాదున్’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్న నితిన్ త్వరలోనే రీమేక్ ను సెట్స్ పై పెట్టబోతున్నాడు. ప్రస్తుతం ఈ రీమేక్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా కొన్ని మార్పులు చేస్తున్నారు.

ఈ రీమేక్ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు ఈ విషయాన్ని నితిన్ ప్రకటించాడు. అయితే ఈ రీమేక్ చేయడానికి కొంచెం భయపడుతున్నానని చెప్పుకొచ్చాడు నితిన్. ఇటివలే ఆయుష్మాన్ కి ఆ సినిమాకు గానూ నేషనల్ అవార్డు వచ్చిందని అది భయం కలిగించిందని అన్నాడు.

సమ్మర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలిపాడు. ఇక మూడు సినిమాలు ఒకే సారి చేయడం నరకం అంటూ చెప్పుకున్నాడు. ఇకపై ఒకే సారి మూడు సినిమాలు చేయనని తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here