బాహుబలి ఇంపాక్ట్ సైరా పై…కాచుకోండి ఇక!! | 123Josh.com
Home న్యూస్ బాహుబలి ఇంపాక్ట్ సైరా పై…కాచుకోండి ఇక!!

బాహుబలి ఇంపాక్ట్ సైరా పై…కాచుకోండి ఇక!!

0
637

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా ప్రమోషన్ ఇంకో రెండు రోజుల్లో మొదలు కానుంది. మేకింగ్ వీడియోతో మొదలుపెట్టి ఆపై బర్త్ డే కంతా పీక్స్ కు తీసుకెళ్లే ప్లాన్ లో ఉంది కొణిదెల యూనిట్. మరోవైపు అక్టోబర్ 2 రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేనట్టే. దానికి తగ్గట్టే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ని వివిధ దేశాల్లో యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేస్తున్నారు. బిజినెస్ డీల్స్ ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతున్నాయి.

తాజా అప్ డేట్ ప్రకారం హింది హక్కులు ప్రముఖ నిర్మాత అనిల్ తదాని స్వంతం చేసుకున్నట్టు టాక్. ఫర్హాన్ అక్తర్ కు చెందిన ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఇండియా వైడ్ సైరా రిలీజ్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ కు ఎక్సెల్ గతంలోనే అంగీకారం తెలిపింది. ఫైనల్ డీల్ క్లోజ్ చేయడానికి కొంత టైం పట్టింది

బాహుబలి తర్వాత సౌత్ సినిమాలు అందులోనూ తెలుగు వాటికి బాగా డిమాండ్ పెరిగింది. సాహో కూడా ఉన్నప్పటికీ అది కమర్షియల్ యాక్షన్ మూవీ కావడంతో సైరాకు బాహుబలితోనే పోలిక వస్తోంది. బడ్జెట్ కూడా వాటికి ధీటుగా రెండు వందల కోట్ల దాకా అయ్యిందన్న టాక్ ఇప్పుడు ప్లస్ గా మారుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here