బెల్లంకొండ తన కెరీర్ టాప్ 3 మూవీస్ ఇవే అని డిక్లేర్ చేశాడు!! | 123Josh.com
Home న్యూస్ బెల్లంకొండ తన కెరీర్ టాప్ 3 మూవీస్ ఇవే అని డిక్లేర్ చేశాడు!!

బెల్లంకొండ తన కెరీర్ టాప్ 3 మూవీస్ ఇవే అని డిక్లేర్ చేశాడు!!

0
1601

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో ఓ అరడజనుకు పైగా సినిమాలు చేశాడు కానీ మొదటి విజయం మాత్రం తాజా చిత్రం ‘రాక్షసుడు’ తోనే దక్కింది.  సినిమా ఎంత కలెక్ట్ చేసింది.. ఏ రేంజ్ హిట్ అనే ఫైనల్ కలెక్షన్ వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ బెల్లంకొండ శ్రీనివాస్ కు మొదటి సక్సెస్ ఇదే అని అనుకోవచ్చు.  మరి ఈ సినిమా బెల్లంకొండ హీరోకు ఖచ్చితంగా ప్రత్యేకమైనదే.అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ

‘మీ సినిమాల్లో టాప్ 3 సినిమాలు చెప్పండి’ అని ఇంటర్వ్యూయర్ అడిగితే ‘అల్లుడు శీను’కు ఫస్ట్ ప్లేస్.. ‘జయ జానకి నాయక’ కు సెకండ్ ప్లేస్.. మూడవ స్థానం ‘రాక్షసుడు’ కు ఇచ్చాడు.  ఈ టాప్ 3 ర్యాంకింగ్ చాలామందిని ఆశ్చర్యపరిచింది.  ఎందుకంటే రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ‘ఇది నా మొదటి సినిమా అనుకోండి’ అంటూ వ్యాఖ్యానించాడు.  ఈలెక్కన మొదటి ర్యాంక్ ‘రాక్షసుడు’ సినిమాకే ఇస్తాడని కొందరు అనుకున్నారు.

మరి ‘అల్లుడు శీను’ సినిమాకు ఎందుకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినట్టు? ఈమధ్య బెల్లంకొండ సురేష్.. శ్రీనివాస్ ఇద్దరూ ‘రాక్షసుడు’ ను మొదటి సినిమాగా భావించమని ప్రేక్షకులను కోరడం.. ఇదే మొదటి సినిమా అని చెప్పడం వినాయక్ ను అప్సెట్ చేసింది.  ఈ విషయంపై వినాయక్ ఓపెన్ గానే తన అసహనాన్ని ప్రదర్శించాడు.  దీంతో వినాయక్ ను బుజ్జగించేందుకే బెల్లంకొండ శ్రీనివాస్ తన టాప్ 3 లిస్టులో మొదటి స్థానం వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లుడు శీను’ కు కట్టబెట్టాడని..  ఇదే సమస్య మళ్ళీ బోయపాటి శ్రీనుతో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ‘జయ జానకీ నాయక’చిత్రానికి రెండవ స్థానాన్ని ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here