భారీ గా రిలీజ్ కాబోతున్న ఒరేయ్ బుజ్జిగా…ఏమవుతుందో మరి!

0
11237

ఆహా ఓటీటీలో విడుదలైన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని నూతన సంవత్సర కానుకగా జనవరి 1న థియేటర్ లలో విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేసిన సినిమాల్ని థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

త్వరలోనే ఆహాలో మంచి టాక్ తో నడిచిన ‘కలర్ ఫొటో’ సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఎన్ని థియేటర్లు తెరుచుకుంటాయో ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు ఎప్పటిలా వస్తారా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here