మక్కి కి మక్కి దింపేశారు సామి!! | 123Josh.com
Home న్యూస్ మక్కి కి మక్కి దింపేశారు సామి!!

మక్కి కి మక్కి దింపేశారు సామి!!

0
4129

టాలీవుడ్ లో మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ఇప్పటికే హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తే తెలుగుకన్నా పెద్ద హిట్ అయింది. తాజాగా ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’  విడుదలైంది.  విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు దర్శకుడు గిరీశయ్య.

మరి ఈ సినిమాకు స్పందన ఎలా ఉంది అంటే దాదాపుగా పాజిటివ్ గా ఉంది.  సినిమాను ఒరిజినల్ కు అనుగుణంగానే రూపొందించారు. అయితే స్వల్ప మార్పులు ఉన్నాయి.  ఒరిజినల్ లో హీరోయిన్ కు ఒక వ్యక్తిత్వం అంటూ ఉన్నట్టుగా కనిపించదు.  పురుషాధిక్య భావనలు ఉన్న హీరో ‘ఈ ప్రాపర్టీ నాది’ అంటే ‘అవును’ అన్నట్టుగా నడుచుకుంటుంది. 

హిందీలో కూడా ఈ పాత్రలో మార్పుచేర్పులు చెయ్యలేదు.  తమిళంలో మాత్రం హీరోయిన్ బలవంతంగా ప్రేమలో పడినట్లుగా కాకుండా తను కూడా అదిత్య వర్మను ఇష్టపడినట్టుగా చూపించారు. ఇక అర్జున్ రెడ్డి పాత్రలో కొన్ని విపరీత పోకడల ఇంటెన్సిటీ తగ్గించారు. ఒరిజినల్ సినిమాను ఆరాధించేవారికి ఈ మార్పులు నచ్చకపోవచ్చు కానీ ఈ సినిమాను గతంలో చూడనివారికి మాత్రం ఆ మార్పులు నచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here