మరో రీమేక్ పై రామ్ చరణ్ కన్ను…షాక్ అవుతున్న ఫ్యాన్స్!! | 123Josh.com
Home గుసగుసలు మరో రీమేక్ పై రామ్ చరణ్ కన్ను…షాక్ అవుతున్న ఫ్యాన్స్!!

మరో రీమేక్ పై రామ్ చరణ్ కన్ను…షాక్ అవుతున్న ఫ్యాన్స్!!

0
669

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మలయాళంలో సూపర్ హిట్ అయిన చిన్న సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’ చిత్రాన్ని రామ్ చరణ్ రీమేక్ చేయబోతున్నాడట. అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న కాన్సెప్ట్ ఓరియంట్ మూవీగా డ్రైవింగ్ లైసెన్స్ నిలిచింది.

సినిమాను గురించి సన్నిహితుల ద్వారా తెలుసుకున్న రామ్ చరణ్ ఆ సినిమాను చూసి వెంటనే కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సినిమా గురించి తెలిసిన వారు.. ఆ సినిమాను చూసిన వారు ఒక మంచి సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ తీసుకున్నాడు.. మంచి అభిరుచి కలిగిన నిర్మాతగా ఈ రీమేక్ తో చరణ్ పేరు తెచ్చుకుంటాడు అంటూ ఆ సినిమా చూసిన వారు అంటున్నారు.

హీరోగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఊపిరి కూడా తీసుకోలేనంత బిజీగా ఉన్న చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంతో ఆయన టేస్ట్ ఏంటో తెలిసి పోయిందంటున్నారు. ఈ సినిమాను ఏ హీరోతో రీమేక్ చేస్తాడు.. ఎవరి దర్శకత్వం లో అనేది త్వరలో వెళ్లడి చేసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here