మళ్ళీ ఆ నిర్మాతతో బాలయ్య సినిమా…ఫ్యాన్స్ లో టెన్షన్!

0
11301

బాలకృష్ణ కెరీర్ లో తీవ్రంగా నిరాశ పర్చిన సినిమాలుగా జయసింహా మరియు రూలర్ లు నిలుస్తాయి. ఈ రెండు సినిమాలను కూడా సి కళ్యాణ్ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నిర్మించాడు. ఇప్పుడు వీరి కాంబోలో

మూడవ సినిమాకు రంగం సిద్దం అవుతుందట. బాలకృష్ణ హీరోగా మరో సినిమాను నిర్మిస్తాను అంటూ సి కళ్యాన్ ఇటీవల ఒకానొక సందర్బంగా ప్రకటించాడు. ఆ సినిమా ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన విషయమై మరో పుకారు షికారు చేస్తోంది.

వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమాకు కూడా కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు అంటున్నారు. ఇప్పటికే రెండు ప్లాప్ లు పడ్డా కూడా మళ్లీ నమ్మకంతో బాలయ్య వీరిద్దరికి అవకాశం ఇస్తున్నాడని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here