మహేష్ నే డామినేట్ చేసిన అల్లు అర్జున్!! | 123Josh.com
Home గుసగుసలు మహేష్ నే డామినేట్ చేసిన అల్లు అర్జున్!!

మహేష్ నే డామినేట్ చేసిన అల్లు అర్జున్!!

0
5557

ఓవర్సీస్ లో సూపర్ స్టార్ మహేష్ హవా గురించి తెలిసిందే. వరుసగా తొమ్మిదోసారి వన్ మిలియన్ డాలర్ క్లబ్ హీరోగా రికార్డులకెక్కాడు. సరిలేరు నీకెవ్వరుతో ఈ ఫీట్ సాధ్యమైంది. మహేష్ తో పోలిస్తే అమెరికా మార్కెట్లో బన్నీకి అంతగా రికార్డులేవీ లేవు. ఒక్క సన్నాఫ్ సత్యమూర్తి మినహా చెప్పుకోదగ్గ వసూళ్ల రికార్డు లేదు. త్రివిక్రమ్ ఫ్యాక్టర్ తో సన్నాఫ్ సత్యమూర్తి ఇంతకుముందు 348 కె డాలర్ల ప్రీమియర్ రికార్డును అందుకుంది. వన్ మిలియన్ డాలర్ క్లబ్ లోనూ బన్ని చేరాడు.

తాజాగా 2020 సంక్రాంతి పందెం హీటెక్కిస్తోంది. ఆ క్రమంలోనే ఓవర్సీస్ లో మహేష్ పై బన్ని పై చేయి సాధించడం ఆసక్తిగా మారింది. బన్ని నటించిన అల వైకుంఠపురములో అమెరికాలో కేవలం 175 లొకేషన్లలో రిలీజై 800కె డాలర్లను వసూలు చేసింది. అక్కడ సరిలేరు నీకెవ్వరు టిక్కెట్ ధరతో పోలిస్తే అల.. టిక్కెట్ రేటు చాలా తక్కువ.

కేవలం టికెట్ కి 14 డాలర్ల ధరతోనే బన్ని ఈ ఫీట్ ని సాధించాడు. సరిలేరు టికెట్ ధరను 22 డాలర్లుగా నిర్ణయించగా దానికంటే .. 8 డాలర్లు తక్కువకు అల టిక్కెట్ అందుబాటులో ఉండడమే ఈ రికార్డును అందుకోవడానికి కారణమని విశ్లేషిస్తున్నారు. కనీసం 18 డాలర్ల ధర నిర్ణయించినా ఈపాటికే వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో బన్ని చేరి ఉండేవాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here