మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ కి వెళ్ళేది ఎప్పుడంటే!! | 123Josh.com
Home న్యూస్ మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ కి వెళ్ళేది ఎప్పుడంటే!!

మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ కి వెళ్ళేది ఎప్పుడంటే!!

0
1877

సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లిని కాదని పరశురామ్ స్క్రిప్టును లాక్ చేసినట్టేనా? అంటే … తాజా సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. అంతే కాదు ఎంబీ 27 చిత్రాన్ని జూలైలో లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. సమ్మర్ 2021 రిలీజ్ లక్ష్యంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. పరశురామ్ దర్శకుడిగా ఫైనల్ అవ్వగా.. మదీ సినిమాటోగ్రఫర్ గా ఎంపికయ్యారు.

గోపిసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. కథానుసారం అమెరికాలో మెజారిటీ పార్ట్ చిత్రీకరణ సాగనుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రం కోసం దాదాపు 70-80 కోట్లు వెచ్చించనుందన్న ప్రచారం సాగుతోంది.

అన్నట్టు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కించనున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152వ చిత్రం ఆచార్యలోనూ మహేష్ ఓ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here