మహేష్ 27 వ సినిమా హీరోయిన్ చేంజ్!! | 123Josh.com
Home గుసగుసలు మహేష్ 27 వ సినిమా హీరోయిన్ చేంజ్!!

మహేష్ 27 వ సినిమా హీరోయిన్ చేంజ్!!

0
1356

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు 27 వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రాజెక్ట్ సెట్స్ కు వెళ్లడం ఆలస్యమవుతోంది. లేదంటే ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసి పట్టాలెక్కేయాల్సి ఉండేది. ఇప్పటికి జూన్ ముహూర్తం అన్న టాక్ అయితే వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో గ్యాప్ రావడంతో పరశురాం కూల్ గా నటీనటులు..సాంకేతిక నిపుణుల ఎంపిక పనుల్లో ఉన్నాడు. ఇప్పటికే మహేష్ కు జంటగా కీర్తి సురేష్ ని తీసుకుంటున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇదేదీ అధికారికం కాదు. ఈలోగానే కియారా అద్వాణీ పేరు కూడా తెరపైకి వచ్చింది.

`భరత్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియరా అటుపై వినయ విధేయ రామ ఫ్లాపవ్వడంతో అటుపై టాలీవుడ్ వైపు చూడనే లేదు. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో బిజీ నాయికగా కొనసాగుతోంది. ఇక తెలుగు వరకూ.. దూరమైపోయింది. ఒక రకంగా తనను తాను బ్యాన్ చేసుకుని దూరమైపోవడంతో బ్యాన్ గాళ్ అన్న ముద్ర పడిపోయింది. అయితే అన్నిటికీ చెక్ పెడుతూ.. మరోసారి మహేష్ తన సరసన కియారాకి ఛాన్సిస్తున్నారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here