`మాస్టర్` సెట్స్ నుండి దళపతి విజయ్ సెల్ఫీ 2020 సంవత్సరంలో అత్యధిక రీట్వీట్ చేసిన ఫోటోగా రికార్డులకెక్కింది. నైవేళి షూట్ పూర్తయిన క్రమంలో విజయ్ అభిమానులతో పాటు సెల్ఫీని బంధించి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ చిత్రం తక్షణమే అభిమానులు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.
ఇది స్వల్ప వ్యవధిలో వైరల్ అయ్యింది. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక రీట్వీట్ చేసిన ఫోటోగా మారింది. ట్విట్టర్ లో సెల్ఫీ చిత్రాన్ని పంచుకున్న విజయ్.. “థాంక్స్ నైవేళి” అని రాశాడు. ఈ ట్వీట్ లో ప్రస్తుతం 158.1 కె రీట్వీట్లు ఉన్నాయి.
విజయ్ నటించిన మాస్టర్ రిలీజయ్యే వరకూ అతడే ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు విరాట్ కోహ్లీ ఫోటోని సంవత్సరంలో ఎక్కువగా వైరల్ చేశారు అభిమానులు.