మాస్ కాదు…మెంటల్ మాస్ తెప్పించే సినిమా చేయనున్న పవర్ స్టార్!! | 123Josh.com
Home గుసగుసలు మాస్ కాదు…మెంటల్ మాస్ తెప్పించే సినిమా చేయనున్న పవర్ స్టార్!!

మాస్ కాదు…మెంటల్ మాస్ తెప్పించే సినిమా చేయనున్న పవర్ స్టార్!!

0
1372

2012లో వచ్చిన గబ్బర్ సింగ్ హవా ఇప్పటికి టీవీలో వస్తే కళ్లప్పగించి చూస్తారు. ఆ తర్వాత హరీష్ శంకర్ అంతటి విజయాన్ని అందుకోలేక పోయాడు. గతేడాది వరుణ్ తేజ్ తో రూపొందించిన ‘గడ్డలకొండ గణేష్’ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. అయితే సినీ వర్గాల ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ హరీష్ శంకర్ కి అవకాశం ఇవ్వనున్నాడట.

ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం మంచి మాస్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ లో సినిమా రాబోతుంది అంటేనే అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే మళ్లీ గబ్బర్ సింగ్ లాంటి మాస్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారట. అభిమానుల అంచనాలు అందుకునే విధంగా హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

స్క్రిప్ట్ పూర్తవ్వగానే పవన్ కళ్యాణ్ కి వినిపించాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న పీరియాడిక్ డ్రామా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ రెండు సినిమాల అనంతరం హరీష్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేస్తాడట పవర్ స్టార్. దాదాపు ఈ సంవత్సరం ఎండింగ్ లో షూటింగ్ ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here