మాస్ కి కిక్ ఇచ్చిన స్టైలిష్ స్టార్ న్యూ లుక్!! | 123Josh.com
Home న్యూస్ మాస్ కి కిక్ ఇచ్చిన స్టైలిష్ స్టార్ న్యూ లుక్!!

మాస్ కి కిక్ ఇచ్చిన స్టైలిష్ స్టార్ న్యూ లుక్!!

0
850

స్టైలిష్ స్టార్ అన్న బిరుదును సార్థకం చేసుకుంటున్నాడు బన్ని. అతడు ఏ సినిమాలో నటించినా స్టైల్ కంటెంట్ ని ఏమాత్రం తగ్గనివ్వడు. కాస్ట్యూమ్ సెలక్షన్.. నటన.. డ్యాన్సులు ప్రతిదాంట్లో యాటిట్యూడ్ తో కూడుకున్న స్టైల్ మైమరిపిస్తుంటుంది. అందుకే మెగా హీరోల్లోనే ఛాలెంజింగ్ హీరోగా ఎదిగాడు.

ఇక బన్ని కెరీర్ లో త్రివిక్రమ్ ఒక ప్రత్యేక ఆధ్యాయం. సుకుమార్ తర్వాత తనకు జిగిరీ దోస్తీగా త్రివిక్రమ్ వరుస బ్లాక్ బస్టర్లు ఇస్తున్నాడు. జులాయి- సన్నాఫ్ సత్యమూర్తి లాంటి క్లాసిక్ హిట్స్ ని తన కెరీర్ కి అందించిన త్రివిక్రమ్ ఈసారి హ్యాట్రిక్ కోసం చాలానే శ్రమిస్తున్నాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ – గీతాఆర్ట్స్ భారీ పెట్టుబడుల్ని పెడుతున్నాయని తెలుస్తోంది. 2020 సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here