మాస్ మహారాజ్ కొత్త సినిమాలు ఏంటో తెలుసా? | 123Josh.com
Home గుసగుసలు మాస్ మహారాజ్ కొత్త సినిమాలు ఏంటో తెలుసా?

మాస్ మహారాజ్ కొత్త సినిమాలు ఏంటో తెలుసా?

0
1548

ప్రస్తుతం వి.ఐ ఆనంద్ డైరెక్షన్ లో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్న రవి తేజ ఈ సినిమా తర్వాత రెండు సినిమాలను ఫైనల్ చేసుకున్నాడట. నెక్స్ట్ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘డాన్ సీను’ మంచి సక్సెస్ అందుకుంది.

ఇప్పుడు మళ్లీ అలాంటి ఎంటర్టైన్ మెంట్ ఉండే కథతోనే వీరిద్దరూ సినిమా చేయనున్నారట.గోపిచంద్ తర్వాత సుధీర్ వర్మ డైరెక్షన్ లో రవితేజ సినిమా చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది.అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ కాంబినేషన్ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని సమాచారం.

ఆ మధ్య రవి తేజ కోసమే ‘రణరంగం’ కథను రాసుకున్నాడు సుధీర్ వర్మ. కానీ అది అనుకోకుండా శర్వాతో చేయాల్సి వచ్చింది. శర్వా ఆసక్తి మేరకూ రవి తేజ కథను వదులుకున్నాడు. అందుకే ఇప్పుడు మాస్ మహరాజ్ కోసం ఓ అదిరిపోయే కథను సిద్ధం చేశాడట సుదీర్. ప్రస్తుతానికైతే రవి తేజ నెక్స్ట్ ఈ రెండు సినిమాలు ఫిక్సయ్యాడాని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here