మెగాస్టార్ బయోపిక్…లైన్ లో 2 ఇద్దరు మెగా హీరోలు…ఒక డైరెక్టర్!! | 123Josh.com
Home న్యూస్ మెగాస్టార్ బయోపిక్…లైన్ లో 2 ఇద్దరు మెగా హీరోలు…ఒక డైరెక్టర్!!

మెగాస్టార్ బయోపిక్…లైన్ లో 2 ఇద్దరు మెగా హీరోలు…ఒక డైరెక్టర్!!

0
2998

‘వాల్మీకి’ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ ఉన్న వరుణ్ తేజ్ కి తాజాగా ఒక ప్రశ్న ఎదురైంది. మెగా స్టార్ బయోపిక్ చేయాల్సి వస్తే చేస్తారా అనేది ఆ ప్రశ్న. దానికి ఏ మాత్రం తడుముకోకుండా జవాబిచ్చారు మెగా ప్రిన్స్. పెదనాన్న బయోపిక్ తీయాల్సి వస్తే చరణ్ అన్న చేస్తేనే బాగుంటుంది. ఒక వేళ చరణ్ అన్న చేయకపోతే కనుక లిస్ట్ లో నేనే ముందుంటాను. ఈ లవ్ టూ డూ దట్ రోల్. ఆయన పాత్ర అంటే అది ఒక ఛాలెంజింగే అని వరుణ్ తెలిపాడు.

అంతే కాదు హరీష్ శంకర్ కి మెగా స్టార్ బయోపిక్ చేయాలనుందట. ఎప్పటికైనా ఆ సినిమా చేస్తే నేనే చేస్తా అంటూ వరుణ్ దగ్గర ప్రస్తావించడట. ఈ విషయాన్ని కూడా చెప్పాడు మెగా హీరో. ఇదే సందర్బంలో తనకి ఓ పీరియాడిక్ సినిమా చేయలనుంది – కాకపోతే అలాంటి కథలు తన దగ్గరికి రావట్లేదని చెప్పుకున్నాడు.

ఇక సైరా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నాని నిన్న రాత్రి చరణ్ అన్న చూపిస్తానంటూ మళ్లీ మర్చిపోయాడని – తనకి ప్రమోషన్స్ వర్క్ ఉండటం వల్ల ఎక్కువ సేపు ఉండకుండా వచ్చేశానని ఇప్పుడు సాయంత్రం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తునాన్నని పెదనాన్న ని స్క్రీన్ మీద చూడటానికి ఎంతో ఇష్టపడుతుంటానని చెప్పాడు వరుణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here