మెగా పవర్ స్టార్…ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పినట్లేనా?? | 123Josh.com
Home గుసగుసలు మెగా పవర్ స్టార్…ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పినట్లేనా??

మెగా పవర్ స్టార్…ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పినట్లేనా??

0
1345

ఆర్ఆర్ఆర్ చిత్రంలో హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్ మరియు చరణ్ లలో ఇప్పటికే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక చరణ్ సినిమా ఎవరితో అనే విషయంలో క్లారిటీ రావడం లేదు.

కొరటాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో ముఖ్య పాత్రను చరణ్ పోషించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే చరణ్ పూర్తి స్థాయి సినిమా ఎప్పుడు ఎవరితో అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఎంతో మంది దర్శకులు రచయితలు చరణ్ కు కథలు చెప్పారు. వారిలో యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా ఉన్నాడు.

మళ్లీ రావా మరియు జెర్సీ చిత్రాలతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈయన చరణ్ తో ఉన్న సన్నిహిత్యంతో కథ చెప్పాడట. ఆ కథకు చరణ్ కూడా దాదాపుగా ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి చరణ్ కొత్త సినిమాలకు ఓకే చెప్పలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తి చేసిన తర్వాతే చరణ్ కొత్త సినిమాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here