రజినీ సినిమా ఇక అప్పుడు రానట్లే లెక్క! | 123Josh.com
Home గుసగుసలు రజినీ సినిమా ఇక అప్పుడు రానట్లే లెక్క!

రజినీ సినిమా ఇక అప్పుడు రానట్లే లెక్క!

0
2963

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దరువు శివ (సిరుత్తై శివ) ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తళా అజిత్ తో వరుసగా నాలుగు సినిమాలు చేసిన శివ తొలిసారి సూపర్ స్టార్ రజనీ కాంత్ ని డైరెక్ట్ చేస్తున్నారు.

`అన్నేటె` అనేది ఈ సినిమా టైటిల్. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. 2021 సంక్రాంతి కి రిలీజ్ చేయాలన్నది ప్లాన్.సాధ్యమైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేయాలని భావించినా వీలుపడలేదు.

తాజా సన్నివేశం చూస్తుంటే 2021 సంక్రాంతి రిలీజ్ కూడా కష్టమేనని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జనవరి 2021 కి వాయిదా వేశారు. అప్పటికి వీలు పడదు. 2021 వేసవిలో మాత్రమే రిలీజయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here