రామ్ చరణ్ నిర్ణయం కోసం అంతా వెయిటింగ్!! | 123Josh.com
Home గుసగుసలు రామ్ చరణ్ నిర్ణయం కోసం అంతా వెయిటింగ్!!

రామ్ చరణ్ నిర్ణయం కోసం అంతా వెయిటింగ్!!

0
6261

రామ్ చరణ్ కి ఇప్పటికే స్క్రిప్ట్స్ రెడీ చేసిన డైరెక్టర్స్ లిస్టులో వంశీ పైడిపల్లి – వెంకీ కుడుముల – సురేందర్ రెడ్డి ఉన్నారని సమాచారం. ‘భీష్మ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల తనశైలిలో ఓ స్క్రిప్ట్ వినిపించాడని వార్తలు వస్తున్నాయి.

అదే క్రమంలో వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా ఓకే కాకపోవడంతో చరణ్ దగ్గరకి వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో వీరి కాంబోలో ‘ఎవడు’ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరితో పాటు చరణ్ కి ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్ అందించిన సురేందర్ రెడ్డి కూడా లైన్లో ఉన్నాడు.

ఈ ముగ్గురు దర్శకులు కూడా తదుపరి సినిమాలను ప్రకటించకుండా వెయిట్ చేస్తున్నారు. దీంతో వీరిలో ఒకరికి చరణ్ అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. మెగా కంపౌండ్ నుండి బన్నీ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసాడు.. ఇక చెర్రీ ఎప్పుడు తదుపరి సినిమా వివరాలు వెల్లడిస్తారో అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here