రిలీజ్ కి ముందే కళ్యాణ్ రామ్ సినిమా కి కష్టాలు!! | 123Josh.com
Home గుసగుసలు రిలీజ్ కి ముందే కళ్యాణ్ రామ్ సినిమా కి కష్టాలు!!

రిలీజ్ కి ముందే కళ్యాణ్ రామ్ సినిమా కి కష్టాలు!!

0
1579

ఎగ్జిబిటర్ గా రాజుగారి అనుభవ చాణక్యం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా పరిశ్రమలో రాజుగారు ఎదిగారు. నిర్మాతగా రాణిస్తూనే పంపిణీ రంగంలోనూ సత్తా చాటుతున్నారు. అందుకే ఏ హీరో సినిమా రిలీజవ్వాలన్నా! ఆయనను సంప్రదించాలి. ఆయనకే అమ్మాలి. కంటెంట్ నచ్చితే ఆయన రిలీజ్ చేస్తారు… మరీ నచ్చితే రైట్స్  కొనుక్కొని రిలీజ్ చేస్తారు. రాజుగారి మెయిన్ బిజినెస్ ఇది.

ఇక కీలకమైన వైజాగ్- ఉత్తరాంధ్రలో థియేటర్లు అన్ని రాజుగారి చేతిలోనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆయన కనుసన్నలోనే థియేటర్ల వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఇటీవలే దర్బార్ చిత్రాన్ని ఆయనే రిలీజ్ చేసారు. తొలి రెండు మూడు రోజులు దర్బార్ కు మంచి వసూళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంకా కొన్ని థియేటర్లలో దర్బార్ రన్ అవుతోంది. ఇప్పుడా  ప్రభావం `ఎంత మంచివాడవురా` సినిమాపై పడిందట. 

ఎంతమంచి వాడవురా ఉత్తరాంధ్ర రిలీజ్ రైట్స్ రాజు గారికి ఇవ్వకపోవడంతో మంచోడికి రిలీజ్ కు ముందే కష్టాలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్రాలో  ఎంత మంచివాడవురా కు కేవలం 15 థియేటర్లు మాత్రమే దొరికాయట. దర్బార్ ఇంకా ఆ  మూడు జిల్లాల్లో 20 థియేటర్లలలో ఆడుతోంది. దానికి కారణం రాజుగారేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్బార్ ని తొలగించే సన్నివేశం లేదట. దీంతో మంచివాడికి రిలీజ్ కు ముందు కష్టాలు తప్పడం లేదట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here