రిలీజ్ కి ముందే 50 మిలియన్స్… ఇది అరాచకం అంటే!!

0
11408

ఈ మధ్య యూట్యూబ్ లో తెలుగు పాటలు భారీ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ఇటీవలే ‘అల వైకుంఠపురంలో’ పాటలు సృష్టించిన సంచలనం మాములు విషయం కాదు. దేశ విదేశాలలో ఆ పాటలకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక ఆ ఆల్బమ్ సాంగ్స్ అన్నీ 100మిలియన్ల పైనే వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి.

ఇక అలాంటి అరుదైన రికార్డును ఉప్పెన సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట 50మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఆల్బమ్ లోని ఫస్ట్ సాంగే ఈ ఫీట్ సాధించడం విశేషమే. ఇక ఈ సినిమా ఏప్రిల్ 2నే విడుదల కావాల్సి ఉండగా.. లాక్ డౌన్ కారణంగా నిలిపేశారు. విడుదల ఎప్పుడనేది లాక్ డౌన్ అయిపోతే తెలుస్తుంది.

రొమాంటిక్ లవ్స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విషాదంతో ముగుస్తుందని సమాచారం. పాటలతో విశేషాంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా థియేటర్లో ఎలా ఆకట్టుకోనుందో అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here