రోమాలు నిక్కబోర్చుకున్నాయి…సైరా టీసర్ రివ్యూ!! | 123Josh.com
Home న్యూస్ రోమాలు నిక్కబోర్చుకున్నాయి…సైరా టీసర్ రివ్యూ!!

రోమాలు నిక్కబోర్చుకున్నాయి…సైరా టీసర్ రివ్యూ!!

0
5408

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమా అఫీషియల్ టీసర్ 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీసర్ ప్రతీ షాట్ గూస్ బంప్స్ తో నిండిపోయి సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసే విధంగా ఉందని చెప్పాలి.

టీసర్ లో మెగాస్టార్ డైలాగ్స్ లుక్స్, అన్నీ ఆకట్టుకోగా బ్రిటిష్ వారి పై పోరాడిన మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకేక్కించగా టీసర్ ఆ అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పాలి.

ప్రతీ షాక్ లో గ్రాండియర్ ఓ రేంజ్ లో కనిపించగా… సింహం లా మెగాస్టార్ ఆంగ్లేయుల పై విరుచుకుపడటం, ఆ యుద్ధాలు భారీ స్టార్ కాస్ట్ మొత్తం మైండ్ బ్లోయింగ్ గా ఉందని చెప్పొచ్చు. ఇవన్నీ హైలెట్స్ కాగా మెగాస్టార్ లుక్స్ మొదట్లో కొంచం కన్సివింగ్ గా అనిపించక పోయినా…

కానీ రెండో సారి మూడో సారి చూసే సమయానికి అలవాటు పడిపోయే విధంగా ఉండటం బాగుందని చెప్పొచ్చు. మొత్తం మీద టీసర్ అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయమని చెప్పొచ్చు. మీరు టీసర్ చూసి ఎలా అనిపించిందో చెప్పండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here