వకీల్ సాబ్ కి అప్పుడే మోక్షం అన్న మాట!! | 123Josh.com
Home గుసగుసలు వకీల్ సాబ్ కి అప్పుడే మోక్షం అన్న మాట!!

వకీల్ సాబ్ కి అప్పుడే మోక్షం అన్న మాట!!

0
8432

పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ మరో 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. గత నెల నుండి మళ్లీ షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో వకీల్ సాబ్ ను కూడా పున: ప్రారంభించినట్లుగా వార్తలు వచ్చాయి. మొదట వారం రోజులు పవన్ కళ్యాణ్ లేకుండా ముఖ్యమైన నటీనటులతో షూట్ చేసి ఆ తర్వాత పవన్ ను జాయిన్ చేయబోతున్నట్లుగా

పుకార్లు వినిపించాయి. అయితే చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ ను ఇప్పట్లో మొదలు పెట్టేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. వకీల్ సాబ్ షూటింగ్ పున: ప్రారంభం సెప్టెంబర్ నుండి ఉంటుందని అంటున్నారు. కోర్టుకు సంబంధించిన షూటింగ్ ను నిర్వహించనున్నారు.

ఆగస్టులో వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కేంద్రం కూడా చాలా నమ్మకంతో ఆగస్టులో వ్యాక్సిన్ వస్తుందని అంటుంది. అందుకే సెప్టెంబర్ వరకు షూటింగ్ ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here