విజయ్ పై ఇంత వ్యతిరేకత ఎందుకో మరి!! | 123Josh.com
Home న్యూస్ విజయ్ పై ఇంత వ్యతిరేకత ఎందుకో మరి!!

విజయ్ పై ఇంత వ్యతిరేకత ఎందుకో మరి!!

0
3103

తమిళ ఇళయ దళపతి.. స్టార్ హీరో విజయ్ పై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోందన్న చర్చ తమిళనాట సాగుతోంది. ఇప్పటికే విజయ్ పై ఐటీ దాడులతో బెంబేలెత్తించిన బీజేపీ తాజాగా ఆయన చిత్ర షూటింగ్ లోనూ రచ్చ రచ్చ చేయడం సంచలనంగా మారింది.

విజయ్ ఇటీవల తాను నటించిన సినిమాల్లో బీజేపీ నిర్ణయాలను తీవ్రంగా తప్పుపట్టారు. దానిపై బీజేపీ గుర్రుగా ఉంది. అందుకే ఆయనపై ఐటీ రైడ్స్ చేసి ఇప్పుడు షూటింగ్ ను కూడా బీజేపీ కార్యకర్తలు నేతలు అడ్డుకోవడం సంచలనంగా మారింది.

విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మాస్టర్. ఈ చిత్రం నైవేలిలోని ఎన్ఎల్ సీ ప్రాంతంలో షూటింగ్ జరుపుతుండగానే బీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి యూనిట్ వర్గాలతో వాగ్వాదానికి దిగారు. షూటింగ్ అడ్డుకున్నారు.

ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులు అక్కడికి చేరుకొని బీజేపీ కార్యకర్తలతో ఫైటింగ్ కు దిగారు. దీంతో విజయ్ షూటింగ్ స్పాట్ రచ్చరచ్చగా మారింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. విజయ్ సినిమా షూటింగ్ కు పోలీస్ భద్రత పెంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here