విజయ్ బ్లాక్ బస్టర్ బిగిల్ అక్కడ గ్రాండ్ రిలీజ్!! | 123Josh.com
Home గుసగుసలు విజయ్ బ్లాక్ బస్టర్ బిగిల్ అక్కడ గ్రాండ్ రిలీజ్!!

విజయ్ బ్లాక్ బస్టర్ బిగిల్ అక్కడ గ్రాండ్ రిలీజ్!!

0
2927

సినిమా థియేటర్లను తెరిచే పరిస్థితులలో ప్రభుత్వాలు కూడా లేవు. పరిమిత సీట్ల విధానంతో థియేటర్లు ప్రారంభించాలనే ప్రతిపాదన ఉన్నా సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. ఇప్పటికే నష్టాలలో ఉన్న థియేటర్లలో ఇంకా శానిటైజేషన్ చేయడానికి సిద్దంగా లేమని అంటున్నారు.

కానీ మల్టీప్లెక్స్ థియేటర్లు మాత్రం అన్నీ నిబంధనలకు సై అంటున్నాయి. ఈ పరిస్థితులు ఎప్పుడు సర్దుమణుగుతాయో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా విదేశాలలో థియేటర్లు ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే అక్షయ్ కుమార్ ‘గుడ్ న్యూస్’ సినిమా దుబాయ్ లో రిలీజ్ చేశారు.

ఇప్పుడు అదే బాటలో ఫ్రాన్స్ జర్మనీ దేశాలు కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా ‘బిగిల్’తో థియేటర్లు పునః ప్రారంభం చేయబోతున్నారు. ఇక బిగిల్ సినిమా జూన్ 22న ఫ్రాన్స్ లో జూన్ 30న జర్మనీలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన టైమింగ్స్.. స్క్రీన్స్ లిస్ట్ డిస్ట్రిబ్యూటర్లు విడుదల చేశారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here