విజయ్ సేతుపతి లుక్…అదరగొట్టేసింది | 123Josh.com
Home గుసగుసలు విజయ్ సేతుపతి లుక్…అదరగొట్టేసింది

విజయ్ సేతుపతి లుక్…అదరగొట్టేసింది

0
1317

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఉప్పెన సినిమా నుండి ఈ సమయంలో విజయ్ సేతుపతి లుక్ ను విడుదల చేశారు. సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న విషయం ముందు నుండి తెలిసిన విషయమే. అయితే తాజాగా విడుదలైన పోస్టర్ తో విజయ్ సేతుపతి నెగటివ్ ఛాయలు ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని అనిపిస్తుంది.

ఈ తమిళ స్టార్ ఉప్పెన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెల్ల లుంగీ కట్టుకుని చేతికి పాత తరం వాచ్ పెట్టుకుని చెక్క కుర్చీలో కూర్చుని గంభీరంగా భయంకరంగా కాకుండా సింపుల్ గా విలనిజం ఉట్టిపడేలా సిగరెట్ తాగుతూ విజయ్ సేతుపతి ఇచ్చిన ఈ ఫోజ్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది.

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ లో మంచి వ్యూస్ ను దక్కించుకున్నాయి. ముఖ్యంగా నీ కన్ను నీలి సముద్రం పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ నమోదు అవుతున్నాయి. హీరోతో పాటు హీరోయిన్ పై కూడా జనాల్లో ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here