వినయ విదేయ రామ డిస్ట్రిబ్యూటర్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ గొడవ!! | 123Josh.com
Home న్యూస్ వినయ విదేయ రామ డిస్ట్రిబ్యూటర్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ గొడవ!!

వినయ విదేయ రామ డిస్ట్రిబ్యూటర్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ గొడవ!!

0
3963

రామ్ చరణ్ లాస్ట్ ఫిలిం ‘వినయ విధేయ రామ’ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడమే కాకుండా భారీగా ట్రోలింగ్ కు గురైంది.  చరణ్ కెరీర్ లో ఫ్లాపైన సినిమాలు గతంలో కూడా ఉన్నాయి కానీ ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కోవడం మొదటిసారి. ఇక ఓవర్సీస్ లో ఈసినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది.  స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్ల ద్వారానే హాఫ్ మిలియన్ నుంచి వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్స్ వస్తాయి.

అలాంటిది ‘వినయ విధేయ రామ’ కు అమెరికాలో $253 K కలెక్షన్స్ వచ్చాయి అంటే ఎలాంటి డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే తాజగా ఈ సినిమాను ఓవర్సీస్ లో పంపిణీ చేసి చేతులు కాల్చుకున్న ఒక డిస్ట్రిబ్యూటర్ (సెయిలింగ్ స్టోన్స్) ట్విట్టర్  ద్వారా తన అవేదనను పంచుకున్నాడు.  సెయిలింగ్ స్టోన్స్ ట్విట్టర్ హ్యండిల్ ద్వారా “కొందరు ఫ్యాన్స్ అసభ్యకరమైన భాషలో దూషిస్తున్నప్పటికీ చాలా రోజుల నుండి ఓపిక పట్టాము.

ఎవరూ డబ్బు పోగొట్టుకోవాలని అనుకోరు. ‘వినయ విధేయ రామ’ ఎలాంటి డిజాస్టర్ అంటే కనీసం 10% కూడా ఓవర్సీస్ లో రికవర్ చేయలేకపోయింది.  ఒకవైపు డబ్బుపోగొట్టుకుని ఉంటే మరోవైపు  కొందరు అభిమానులు ఇలా దూషణలకు దిగడం చాలా బాధ అనిపిస్తుంది.

ఇదే ఫ్యాన్స్ తమ హీరోను కంటెంట్ కోసం ఎందుకు ప్రశ్నించలేరు?” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఫ్యాన్స్ రిప్లై ఇవ్వడం ఇలా దానికి డిస్ట్రిబ్యూటర్ బదులివ్వడం.. ఇలా సంభాషణ కొనసాగింది. ఒక ఫ్యాన్ అయితే “నిన్నెవరు సినిమాను కొనమన్నారు?” అంటూ డిస్ట్రిబ్యూటర్ కు సమాధానం లేని ప్రశ్న సంధించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here