వీళ్ళ గొడవ ఇప్పుడు పీక్స్ కి వెళ్ళింది గా!! | 123Josh.com
Home న్యూస్ వీళ్ళ గొడవ ఇప్పుడు పీక్స్ కి వెళ్ళింది గా!!

వీళ్ళ గొడవ ఇప్పుడు పీక్స్ కి వెళ్ళింది గా!!

0
3129

రికార్డుల గురించి మాట్లాడుకోవాలంటే ‘బాహుబలికి ముందు-తర్వాత’ అని చెప్పుకోవాలి.  బాహుబలికి ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక సినిమా రికార్డులను మరో సినిమా నెలలోనో.. ఏడాదిలోనో బద్దలు కొట్టేది.  మహా అయితే రెండు మూడేళ్లు.   కానీ బాహుబలి రికార్డులు ఎలా ఉన్నాయంటే అవి బద్దలు కొట్టాలని అదిపనిగా ప్రయత్నించిన తమిళ హిందీ మేకర్లు చతికిల పడ్డారు. ఇక ఇతర తెలుగు మేకర్ల సంగతి సరేసరి. 

  అవి ఇప్పట్లో బ్రేక్ అయ్యేలా లేవు.  దీంతో నాన్-బాహుబలి అనే కేటగిరీని తీసుకొచ్చి సెకండ్ ప్లేస్ కోసం తెగ ఫైట్ చేసుకుంటున్నారు.  ఈ సంక్రాంతికి విడుదలైన పెద్ద సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు’.. ‘అల వైకుంఠపురములో’ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. నిజానికి ఈ సినిమాలకు వచ్చిన ఒరిజినల్ కలెక్షన్స్ కంటే పెంచి చూపిస్తున్నారనే ఆరోపణలు జోరుగా ఉన్నాయి.  ఇక పోటాపోటీగా రెండు సినిమాల మేకర్స్ తమ సినిమా నాన్-బాహుబలి రికార్డు బ్రేక్ చేసిందని.. నాన్ – బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిందని ప్రకటించుకుంటున్నారు. 

రెండు సినిమాలకు ఒకేసారి ఈ రికార్డులు ఎలా వస్తున్నాయో తెలియక జనాలు అయోమయంలో ఉన్నారు.  ఈ రికార్డులపై సోషల్ మీడియాలో జోకులు.. సెటైర్లు పేలుతున్నాయి. నాన్ – బాహుబలి రికార్డులు జెన్యూన్ గా అయితే ‘రంగస్థలం’ పేరిట ఉన్నాయనేది ట్రేడ్ వర్గాల వారి మాట. అయితే ఈ విషయంలో కూడా పెద్దగా ఏకాభిప్రాయం.. క్లారిటీ లేదు.  కొందరేమో ఆ కలెక్షన్స్ ను ‘సాహో’ దాటేసింది అంటారు. కొందరేమో ‘సైరా’ దాటేసింది అని కూడా అంటున్నారు.  అయితే ‘సాహో’.. ‘సైరా’ సినిమాల రియల్ కలెక్షన్స్ బ్రహ్మదేవుడికి కూడా తెలియదట!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here