వీళ్ళ మధ్య మళ్ళీ గొడవ…ఈ సారి రీజన్ ఇది!! | 123Josh.com
Home గుసగుసలు వీళ్ళ మధ్య మళ్ళీ గొడవ…ఈ సారి రీజన్ ఇది!!

వీళ్ళ మధ్య మళ్ళీ గొడవ…ఈ సారి రీజన్ ఇది!!

0
1706

`సరిలేరు నీకెవ్వరు`…`అల వైకుంఠరములో` చిత్రాల మధ్య సంక్రాంతి వార్ ఏ రేంజ్ లో నడిచిందో చెప్పాల్సిన పనిలేదు. ఒకరిపై ఒకరు అధిపత్యం కోసం సాగించిన హంగామా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎవరికి వారే రియల్ సంక్రాంతి విన్నర్స్ అంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే ఇటీవల ఏ గొడవా లేకుండా చల్లబడ్డారు అనుకుంటే…

ఇంతలోనే మరోసారి ఆ ఇద్దరి మధ్య యుద్దం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయ్. ఆ వార్ అభిమానుల మధ్య అంతరాన్ని మరింత పెంచేలా కనిపిస్తోందన్న సంకేతాలు అందుతున్నాయి. మరి ఈ వార్ కి రీజన్ ఏమిటి? అంటే ఆసక్తికర సంగతులే బయటకొస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అయి ఈనెల 29నాటికి 50 రోజులు పూర్తవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు గ్రాండ్ గా 50 రోజుల వేడుక చేయడానికి రెడీ అవుతన్నారు. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం సర్వం సిద్ధం చేసి ధూమ్ ధామ్ అనిపించడానికి యూనిట్ మొత్తం రెడీగా ఉంది. ఆ రోజున వసూళ్ల కు సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ ప్రేక్షకుల ముందు ఉంచాలని నిర్మాత అనీల్ సుంకర ప్లాన్ చేస్తున్నారుట. ఏరియా వైజ్ లెక్కలు చెప్పి ఇదీ మా హీరో దమ్ము!! అని చెప్పాలని భావిస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here