వెంకీ-నాగచైతన్య రెమ్యునరేషన్ పై షాకింగ్ న్యూస్!! | 123Josh.com
Home గుసగుసలు వెంకీ-నాగచైతన్య రెమ్యునరేషన్ పై షాకింగ్ న్యూస్!!

వెంకీ-నాగచైతన్య రెమ్యునరేషన్ పై షాకింగ్ న్యూస్!!

0
1271

విక్టరీ వెంకటేష్- యువసామ్రాట్ నాగచైతన్య కథానాయలుగా నటిస్తోన్న వెంకీమామ ఈ డిసెంబర్ లో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వాస్తవానికి డిసెంబర్ రిలీజ్ అని .. సంక్రాంతి రిలీజ్ అని మామ కన్ఫ్యూజన్ వెంటాడుతోంది. ఇక ఈ సినిమా కోసం మామ- అల్లుడు ఇద్దరూ అతి తక్కువ పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ మామను నిర్మిస్తోంది డి.

సురేష్ కాబట్టి వెంకటేష్ సినిమా విజయం సాధిస్తే అందులో వాటా తీసుకునే అవకాశం ఉందట. బయట బ్యానర్లలో అయితే వెంకీ ఒక్కో సినిమాకు 5 కోట్లు ఛార్జ్ చేస్తారు. కానీ వెంకీ మామ కోసం మాత్రం రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదుట. రిలీజ్ తర్వాత చూసుకుందాం అన్నారుట. ఎలాగూ సురేష్ బాబు సొంత అన్నయ్యే కాబట్టి తమ్ముడికి లోటేం ఉండదు.

ఇక మేనల్లుడు నాగచైతన్య బయట బ్యానర్లో ఒక్కో సినిమాకు 5 కోట్లు తీసుకుంటాడు. కానీ వెంకీమామకు కేవలం కొటిన్నర మాత్రమే అడ్వాన్స్ గా అందుకున్నాడట. అదీ సురేష్ బాబు అతి బలవంతం చేస్తే తీసుకున్నట్లు చెబుతున్నారు. మామ సినిమా కావడంతో షూటింగ్ కోసం ఎక్కువ కాల్షీట్లు కేటాయించాడు. మధ్యలో మరో సినిమా ప్రారంభించాలని ఇతర నిర్మాతలు తొందరపెట్టినా వెంకీ మాను పూర్తిచేసే వరకూ ఏదీ కమిటవ్వలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here