వ్యూస్ లైక్స్ తో రచ్చ లేపుతున్న మహేష్-బన్నీ!! | 123Josh.com
Home న్యూస్ వ్యూస్ లైక్స్ తో రచ్చ లేపుతున్న మహేష్-బన్నీ!!

వ్యూస్ లైక్స్ తో రచ్చ లేపుతున్న మహేష్-బన్నీ!!

0
2491

సినిమా కలెక్షన్స్ కంటే యూట్యూబ్ వ్యూస్.. లైక్స్ ఇప్పుడు ప్రధానంగా మారి పోయాయి.  నిజానికి ఒక సినిమాకు కావాల్సింది కలెక్షన్లు.  ఒక సినిమాకు సంబంధించిన టీజర్.. ట్రైలర్.. సాంగ్స్ వీటిలో దేనికి వ్యూస్ లేకపోయినా కలెక్షన్స్ వస్తే చాలు.  కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కలెక్షన్స్ సంగతి తర్వాత చూద్దాం.. ముందు వ్యూస్ సంగతి తేలుద్దాం అన్నట్టుగా ఉంది.

సంక్రాంతి పోటీలో ఉన్న సినిమాల లో ప్రముఖమైనవి అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’.  అల్లు అర్జున్ టీమ్ చాలా ముందుగా ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టి పాటలు విడుదల చేశారు.  ఇప్పటికే ‘సామజవరగమన’.. ‘రాములో రాముల’ పాటలు కోట్ల కొద్ది వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తున్నాయి.   దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ వెనకబడింది అనుకున్నారు.  అయితే ఈమధ్యే రిలీజ్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ వ్యూస్ విషయం లో దూసుకు పోతోంది. ఇప్పటికే రెండుకోట్ల వ్యూస్ దాటాయని అంటున్నారు. 

ఇక పోటీలో రిలీజ్ అయిన అల్లు అర్జున్ ‘OMG డాడీ’ కి మొదటి రెండు సాంగ్స్ కు వచ్చిన స్పందన దక్కలేదు.  కారణం అది తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా ఆదరణ లేని ర్యాప్ స్టైల్ లో ఉండడమే. ఇవన్నీ పక్కన పెడితే ‘అల వైకుంఠపురములో’ పాటలు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ పై ఎలా ఒత్తిడిని పెంచాయో ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ‘అల వైకుంఠపురములో’ టీం పై ఒత్తిడి పెంచింది.  దీంతో అల్లు అర్జున్ డిజిటల్ టీమ్ కు టీజర్ రిలీజ్ అయితే వ్యూస్ టార్గెట్ భారీగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here