సంక్రాంతి రేసు నుండి అఖిల్ అవుట్….కారణం ఇదేనా!

0
9679

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కి విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ నుంచి అఖిల్ తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లో తన పాత్రకు సంబంధించిన

షూటింగ్ హీరోయిన్ పూజాహెగ్డే ఇప్పటికే పూర్తి చేసిందని తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో ఇప్పుడు అఖిల్ చిత్రం పండక్కి రాకపోవచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అక్కినేని వారసుడి ఈ సినిమా సూపర్ హిట్ అందిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. దీని తర్వాత అఖిల్.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here