సరిలేరు నీకెవ్వరు బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!! | 123Josh.com
Home గుసగుసలు సరిలేరు నీకెవ్వరు బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

సరిలేరు నీకెవ్వరు బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

0
862

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి మొదటిసారి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా విడుదలకు నెల రోజులే ఉండడంతో ప్రమోషన్స్ కూడా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే టీజర్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రతి సోమవారం ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ గురించి కొన్ని వివరాలు తాజగా బయటకు వచ్చాయి.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడికి రూ.8 కోట్లు పారితోషికం ముట్టిందట.  మహేష్ బాబుకు ఇతర నటీనటుల రెమ్యూనరేషన్లన్నీ కలిపితే రూ.60 కోట్లు అయిందట.  సినిమాకు ప్రొడక్షన్ కాస్ట్ రూ. 32 కోట్లు అయిందట.  మొత్తం కలిపి సినిమా బడ్జెట్ రూ.100 కోట్ల మార్క్ టచ్ అయిందని సమాచారం. 

ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.  ఈ సినిమాలో మేజర్ ఎపిసోడ్ ఒకటి ట్రైన్ లో సాగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. నిజానికి ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ట్రెయిన్ లోనే సాగుతుందట.  సీమలో మహేష్ అడుగుపెట్టడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ స్టార్ట్ అవుతుందని.. ఇది చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. మరో విషయం ఏంటంటే ఈ సినిమా రవితేజ ‘నిప్పు’ లాగా ఉండబోతోందని కూడా టాక్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here