సర్కార్ వారి పాట అనే టైటిల్ అందుకోసమేనా?? | 123Josh.com
Home గుసగుసలు సర్కార్ వారి పాట అనే టైటిల్ అందుకోసమేనా??

సర్కార్ వారి పాట అనే టైటిల్ అందుకోసమేనా??

0
1111

సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ ఫిలిం పరశురామ్ తో చేస్తున్నాడనే సంగతి తెలిసిందే. ‘గీత గోవిందం’ తర్వాత చాలా రోజులు వేచి చూసిన పరశురామ్ కు ఇలాంటి అవకాశం లభించడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడట. ఇక ఈ సినిమా మూలకథ గురించి ఫిలిం నగర్లో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వేలకోట్లు అప్పులు తీసుకుని.. బ్యాంకులను ముంచుతూ ఉండే వారు.. విదేశాలకు పారిపోయే వారి బడాబాబుల మోసాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట.   బ్యాంకింగ్ వవస్థలోని లొసుగులను వాడుకుని వేలకోట్లు స్వాహా చేసే మోసగాళ్ళను అడ్డుకునే వ్యక్తిగా మహేష్ బాబు పాత్రను డిజైన్ చేశారట. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ లో ఇదీ ఒకటి కాబట్టి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది భావిస్తున్నారట.

అయితే నిజంగానే ఈ కథతో సినిమా తెరకెక్కుతుందా లేదా ఇది జస్ట్ గాసిప్పేనా అనేది వేచి చూడాలి. ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.  ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31 న లాంచ్ చేస్తున్నారట.  మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here