సూపర్ స్టారా మజాకా….చుక్కలు చూయించాడుగా!! | 123Josh.com
Home న్యూస్ సూపర్ స్టారా మజాకా….చుక్కలు చూయించాడుగా!!

సూపర్ స్టారా మజాకా….చుక్కలు చూయించాడుగా!!

0
5107

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు రివ్యూయర్ల నుంచి.. క్రిటిక్స్ నుంచి యావరేజ్ మార్కులే పడ్డాయి కానీ సినిమా కలెక్షన్స్ మాత్రం వాటికి భిన్నంగా భారీగా ఉన్నాయి.

‘సరిలేరు నీకెవ్వరు’ మొదటి రోజు కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 32 కోట్ల షేర్ వసూలు చేసింది. మహేష్ కెరీర్ లోనే ఇవి అత్యధిక కలెక్షన్లు. సోలో రిలీజ్ దక్కడం.. మొదటి రోజు భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చెయ్యడంతో కలెక్షన్స్ భారీగా నమొదయ్యాయి. ఈ రోజు ఆదివారం..

తర్వాత పండగ శెలవులు ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ లో ఇదే ఊపు కొనసాగే అవకాశం ఉంది. మహేష్ బాబు హీరోయిజం.. అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ మాస్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పిస్తున్నాయి.మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 8.67 cr
ఉత్తరాంధ్ర: 4.41 cr
సీడెడ్: 4.14 cr
గుంటూరు: 5.13 cr
కృష్ణ: 3.08 cr
ఈస్ట్: 3.37 cr
వెస్ట్: 2.74 cr
నెల్లూరు: 1.21 cr
ఎపీ తెలంగాణా టోటల్: 32.75 cr

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here