సెన్సేషనల్ అప్ డేట్….నిజం అయితే ట్విస్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది!! | 123Josh.com
Home గుసగుసలు సెన్సేషనల్ అప్ డేట్….నిజం అయితే ట్విస్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది!!

సెన్సేషనల్ అప్ డేట్….నిజం అయితే ట్విస్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది!!

0
1609

న్యాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ ఇంకో నాలుగు రోజుల్లో థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. జెర్సీ లాంటి హై ఎమోషనల్ డ్రామా తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ ని అభిమానులు ఇందులో ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే కామెడీతో పాటు యాక్షన్ మసాలా కూడా బాగా జోడించినట్టు ట్రైలర్ లో చూపించడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఇందులో ఐదుగురు లేడీ గ్యాంగ్ ని విక్రమ్ కుమార్ సెట్ చేసిన తీరు ఆసక్తిగా ఉంది.

ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన ఒక లీక్ అప్ డేట్ ఆసక్తికరంగా ఉంది.దాని ప్రకారం నాని ఇందులో డ్యూయల్ రోల్ ఉండొచ్చట. ఒకటి కాస్త నెగటివ్ షేడ్స్ తో ఉండేది కాగా రెండోది ప్రమోషన్ లో చూసిన జాలీగా సరదాగా నవ్విస్తూ ఉండే పెన్సిల్ పాత్రట. అంతే కాదు ఒక పాత్రకు విలన్ గా చేస్తున్న కార్తికేయకు ఏదో బలమైన కనెక్షన్ కూడా ఉంటుందని వాటి సారాంశం.

నాని ఇంతకు ముందు మూడు సార్లు డ్యూయల్ రోల్ చేశాడు. జెండాపై కపిరాజు – జెంటిల్ మెన్ – కృష్ణార్జున యుద్ధం.  మొత్తం ఇలా మూడు సినిమాల్లో రెండేసి పాత్రల్లో నటించాడు. కానీ మధ్యలోది మాత్రమే వర్క్ అవుట్ కాగా మిగిలిన రెండు ఫ్లాపయ్యాయి. ఇప్పుడీ గాసిప్ నిజమే అయితే కనక గ్యాంగ్ లీడర్ ఈ వరసలో నాలుగోది అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here