సైరా టీం లెక్కలు తప్పు అయ్యాయి!! | 123Josh.com
Home న్యూస్ సైరా టీం లెక్కలు తప్పు అయ్యాయి!!

సైరా టీం లెక్కలు తప్పు అయ్యాయి!!

0
664

‘సైరా’ టీమ్ అక్టోబర్ 2 న రిలీజ్ డేట్ ఎంచుకోవడంలో మొదటిరోజు పబ్లిక్ హాలిడేతో పాటుగా దసరా సీజన్ ఎడ్వాంటేజ్ తో కలెక్షన్స్ రాబట్టవచ్చని భావించారు. ఓవర్సీస్ లో మంగళ వారం రిలీజ్ అయితే టికెట్ ఆఫర్లతో మంచి కలెక్షన్స్ నమోదు చేయవచ్చని అనుకుంటే అక్కడ అనుకున్నట్టుగా జరగలేదు.

రోజురోజుకు అక్కడ కలెక్షన్స్ డ్రాప్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇతర భాషల వసూళ్ళపై నమ్మకం పెట్టుకున్నా అన్నీ చోట్లా ఈ సినిమాకు నిరాశ తప్పలేదు. తెలుగు రాష్ట్రాల విషయం తీసుకుంటే మొదటి రోజు కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉన్నాయి కానీ రెండోరోజుకు.. మూడో రోజులు డ్రాప్ కనిపించింది.

అయితే వర్కింగ్ డేస్ కాబట్టి డ్రాప్ సహజమే అనుకున్నారు. వీకెండ్ లో శనివారం నుంచి కలెక్షన్స్ పుంజుకుంటాయని భావిస్తే శనివారం కూడా కలెక్షన్స్ లో మెరుగుదల కనిపించలేదు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా టికెట్ రేట్లు పెంచడం ప్రతికూలంగా మారిందనే వాదన వినిపిస్తోంది. ఏరియాలను బట్టి రూ. 150 నుండి రూ. 300 వరకూ టికెట్స్ రేట్స్ ఫిక్స్ చేయడంతో ఫుట్ ఫాల్స్ తగ్గాయని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here