స్టార్ డైరెక్టర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్! | 123Josh.com
Home గుసగుసలు స్టార్ డైరెక్టర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్!

స్టార్ డైరెక్టర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్!

0
782

బాలీవుడ్ స్టార్ హీరో.. అక్షయ్ కుమార్ ఒకింత సంచలన ప్రకటన చేశాడు. గత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ వైవిధ్యభరితమైన సినిమాలే చేస్తున్నాడు. అయితే అవన్నీ కూడా చిన్న సినిమాలు కావడం గమనార్హం! అన్నీ తక్కువ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు మాస్ కు పెద్దగా కనెక్ట్ కాని సినిమాలతో అక్షయ్ కెరీర్ సాగుతూ ఉంది. అయితే అలాగని అతడి సినిమాలు వసూళ్లు సాధించడం లేదని కాదు.

పెద్దగా హడావుడి లేకుండా వచ్చి.. వంద కోట్ల రూపాయల పై స్థాయి వసూళ్లను సాధిస్తున్నాయి అక్షయ్ కుమార్ సినిమాలు. ప్రస్తుతానికి అయితే  ఆ హీరో బిజీగానే ఉన్నాడు. సౌత్ లో హిట్ అయిన ‘కాంచన’ సినిమాను అక్షయ్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తూ ఉన్నాడు. లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందుతూ ఉంది.

ఈ నేపథ్యంలో బడా బడ్జెట్ సినిమాల్లో ఎందుకు చేయడం లేదంటూ మీడియా అక్షయ్ ను ఆరాతీయగా ఆయన ఆసక్తిదాయకమైన వ్యాఖ్య చేశాడు. ‘నాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఛాన్సులు ఇవ్వడం లేదు..’ అని అక్షయ్ కుండబద్దలు కొట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here