హిట్స్ లేవు అన్నారు…సూర్య కంబ్యాక్ కి గూగుల్ లో కూడా చోటు దక్కింది!

0
9734

ఈ ఏడాదిలో అత్యధికంగా ట్రెండ్ అయిన సినిమాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ జాబితాలో నెం.1 గా దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ నటించిన దిల్ బేచారా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదల అయిన విషయం తెల్సిందే. సుశాంత్ మృతి చెందిన తర్వాత విడుదలైన సినిమా..

అతడి చివరి సినిమా అంటూ ప్రచారం చేయడం వల్ల భారీగా ట్రెండ్ అయ్యింది. దిల్ బేచారా తర్వాత సౌత్ మూవీ ‘సూరారై పోట్రూ’ రెండవ స్థానంలో నిలిచింది. సూర్య హీరోగా సుధ కొంగర ద్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు కరోనా వల్ల థియేట్లు మూతబడి ఆగిపోయింది. కొన్ని నెలల పాటు ఈ సినిమా సోషల్ మీడియాలో.. నెట్ లో ట్రెండ్ అవుతూనే ఉంది.

సినిమా విడుదల తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకోవడం వల్ల కూడా మళ్లీ ట్రెండ్డింగ్ కంటిన్యూ అయ్యింది. అందుకే బాలీవుడ్ సినిమాలను వెనక్కు నెట్టి మరీ సూర్య తన సినిమాతో రెండవ స్థానంలో నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here