‘ఖైదీ’ రిలీజ్ టైంలో సినిమా చూసిన రజిని దర్శకుడు లోకేష్ కనకరాజ్ ను అప్పుడే అభినందించారు. అప్పుడు మాస్టర్ మూవీ షూటింగులో బిజీగా ఉన్న లోకేష్.. ఆ సినిమా షెడ్యూల్ పూర్తి అయిన తరువాత స్వయంగా రజనీని కలసి కృతజ్ఞతలు చెప్పాడట.
అయితే ఆ మీటింగ్ సమయంలో లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ తలైవాకి బాగా నచ్చడంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మరో విశేషం ఏంటంటే.. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించే సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థలో నిర్మిస్తాడట. అంతే కాక ఈ సంచలన సినిమాలో కమల్ హాసన్ ఓ గెస్ట్ రోల్ లో నటించబోతున్నాడని తెలుస్తుంది.
శివ దర్శకత్వంలో రజని నటించే సినిమా తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ఇక ఇండియాలో భారీ పారితోషికం తీసుకునే హీరోలలో సూపర్ స్టార్ ఒకరు. అయితే ఈ సినిమాకోసం ఆయన భారీ లెవెల్లో పారితోషికం అందుకోనున్నట్లు సమాచారం. అదికూడా మాములు సంఖ్య కాదు. దాదాపు 100కోట్ల వరకు తీసుకోబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పుకార్లు మాత్రం బాగానే ప్రచారం చేస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా అధికారిక ప్రకటన ఎప్పుడు రానుందో..!