‘బిగ్ బాస్’ షో ఆరంభ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన తారక్.. చివరి వరకు ప్రేక్షకుల అటెన్షన్ ఆ షోపైనే ఉండేలా చేశాడు. అయితే.. తాజాగా జెమినీ టీవీ కూడా ఓ కొత్త షోను స్టార్ట్ చేసేందుకు సిద్ధమైంది. దీనికి హోస్ట్ గా జూనియర్ ను ఎంచుకున్న విషయం కూడా తెలిసిందే.
60 ఎపిసోడ్లు.. 30 లక్షలు.. జెమిని టీవీలో షో చేసేందుకు జూనియర్ ఇప్పటికే సైన్ చేశారు కూడా. మరో రెండు నెలల్లో షూట్ ప్రారంభమవుతుందని తాజా సమాచారం. అయితే.. ఇది ఎలాంటి షో? అనే చర్చ మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం..
కొంచెం డ్రామా కొంచెం సీరియస్ నెస్ కలగలసిన ఒక క్విజ్ షో మాదిరిగా ఉంటుందట. ఈ షోను మొత్తం 60 ఎపిసోడ్లకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతి ఎపిసోడ్కు గానూ ఎన్టీఆర్ కు రూ.30 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. అంటే 60 ఎపిసోడ్లకు కలిపి మొత్తం రూ.18 కోట్లు తీసుకోబోతున్నాడట యంగ్ టైగర్.