2 మాస్ హీరోలతో జక్కన్న ఊచకోత కి 200+ | 123Josh.com
Home గుసగుసలు 2 మాస్ హీరోలతో జక్కన్న ఊచకోత కి 200+

2 మాస్ హీరోలతో జక్కన్న ఊచకోత కి 200+

0
3338

గత కొద్ది రోజులు గా కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 400 కోట్ల మేర రాబట్టాలని రాజమౌళి- దానయ్య టీమ్ ప్రణాళికల్లో ఉందని ప్రచారమైంది. కొందరు అడ్వాన్స్ డ్ గా కొన్ని లెక్కల్ని ఏరియా వైజ్ ఇవీ అంటూ ప్రచారం చేశారు. అయితే అందులో వాస్తవం ఎంత? అన్నది ఆరా తీస్తే.. తాజాగా కొన్ని క్లియర్ కట్ గణాంకాలు రివీలయ్యాయి.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ బిజినెస్ పరిశీలిస్తే… నైజాం – 75 కోట్లు.. సీడెడ్ – 40 కోట్లు… తూర్పు – 18 కోట్లు.. వెస్ట్ -13 కోట్లు.. వైజాగ్ – 25 కోట్లు.. నెల్లూరు – 9 కోట్లు.. గుంటూరు – 18 కోట్లు.. కృష్ణ – 15 కోట్ల మేర బిజినెస్ సాగింది. ఏపీ- నైజాం కలుపుకుని 213 కోట్లు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ సాగిందని తెలుస్తోంది. అంటే ఆ మేరకు షేర్ వసూళ్లను ఆర్.ఆర్.ఆర్ థియేటర్ల నుంచి తేవాల్సి ఉంటుంది. ఇక ఓవర్సీస్.. బెంగళూరు..

ఇతర భారతదేశం లో ఏ మేరకు బిజినెస్ సాగించనుంది అన్న లెక్కలు తెలియాల్సి ఉంది. శాటిలైట్ – డిజిటల్ – ఆడియో సహా రకరకాల మార్గాల్లో ఆర్.ఆర్.ఆర్ పై భారీ బెట్టింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ – రామారావు – రాజమౌళి కాంబినేషన్ మూవీగా ఇప్పటికే నెలకొన్న క్రేజు దృష్ట్యా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నెలకొల్పనుంది? అన్న ఆసక్తి ట్రేడ్ లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here