3 రోజులకే ఆశలు వదులుకున్న హీరో…ప్రమోషన్స్ నిల్!! | 123Josh.com
Home గుసగుసలు 3 రోజులకే ఆశలు వదులుకున్న హీరో…ప్రమోషన్స్ నిల్!!

3 రోజులకే ఆశలు వదులుకున్న హీరో…ప్రమోషన్స్ నిల్!!

0
750

అదేంటో కానీ విజయ్ దేవరకొండ తన గత చిత్రాలకు ప్రచారం చేసిన స్థాయిలో ఈ సినిమాకు ప్రచారం చెయ్యలేదు. రిలీజుకు వారం ముందు నుంచి మాత్రమే ప్రమోషన్స్ టేకప్ చేశాడు. కొన్ని ఇంటర్వ్యూ.. ఈవెంట్స్ తో సరిపుచ్చాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో ప్రమోషన్స్ పూర్తిగా పక్కన పెట్టాడు.

ఒక వైపు అల్లు అర్జున్.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలే తమ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రచారం మోతెక్కించారు. సినిమా రిలీజ్ తర్వాత ఇప్పటివరకూ ఏదో ఒక రూపంలో ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. అలాంటిది విజయ్ తన సినిమాను ఇలా సరిగా ప్రచారం చెయ్యకుండా వదిలేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా సంగతి పక్కనపెట్టి పూరి జగన్నాధ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడట. దీనిపై ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీమ్ అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. హిట్ టాక్ వస్తేనే ప్రమోషన్స్ చేస్తాడని.. ఫ్లాప్ టాక్ వస్తే పట్టించుకోడని కూడా విజయ్ గురించి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా చెయ్యడం సరికాదని ఇతర హీరోలను చూసి విజయ్ నేర్చుకోవాలని అంటున్నారు. మరి రౌడీగారు ఇవన్నీ పట్టించుకుంటారో లేదో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here