400 కోట్ల ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ…కి బాలయ్య మూవీ లింక్! | 123Josh.com
Home గుసగుసలు 400 కోట్ల ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ…కి బాలయ్య మూవీ లింక్!

400 కోట్ల ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ…కి బాలయ్య మూవీ లింక్!

0
2667

వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సెన్సేషనల్ 400 కోట్ల భారీ బడ్జెట్ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. సినిమా ప్రకటన రాగానే నాగ అశ్విన్ ఎలాంటి కథ రెడీ చేశాడు.. సినిమా ఎలా ఉండబోతోందనే ఊహాగానాలు మొదలయ్యాయి.  ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. 

టైమ్ మిషన్..  కాలంలో ప్రయాణం నేపథ్యంలో కథ అనగానే తెలుగులో సూపర్ హిట్ సినిమా ‘ఆదిత్య 369’ అందరికీ గుర్తుకు వస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం బాలయ్య కెరీర్లోనే ఒక మరపురాని చిత్రం. 

విక్రమ్ కుమార్- సూర్య ’24’ టైమ్ ట్రావెల్ నేపథ్యమే కానీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేకపోయింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఓ అద్భుతమైన కథను రెడీ చేశారని.. ఈ సినిమాకు భారీ స్థాయి లో విజువల్ ఎఫెక్ట్స్ అవసరమని అంటున్నారు.  సినిమా కథ ప్రభాస్ స్థాయికి తగ్గట్టుగా ఉంటుందని.. దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాలలో ఉండే ప్రభాస్ అభిమానులను కూడా మురిపించేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here