450 కోట్లు పెట్టిన సినిమా…అక్కడ డిసాస్టర్ అయ్యింది!! | 123Josh.com
Home టోటల్ కలెక్షన్స్ 450 కోట్లు పెట్టిన సినిమా…అక్కడ డిసాస్టర్ అయ్యింది!!

450 కోట్లు పెట్టిన సినిమా…అక్కడ డిసాస్టర్ అయ్యింది!!

0
7748

సెప్టెంబర్ 6వ తారీకున ‘2.ఓ’ చిత్రం చైనా ప్రేక్షకుల ముందుకు వెళ్లింది. మొదటి రోజు పర్వాలేదు అన్నట్లుగా 9 కోట్ల వసూళ్లను రాబట్టింది. కాని ఆ తర్వాత రోజుల్లో కలెక్షన్స్ తగ్గింది. మొదటి వారం పూర్తి అయ్యేప్పటికి ఈ చిత్రం దాదాపుగా 22 కోట్లను వసూళ్లు చేసింది. చైనాలో ఈ మొత్తం తక్కువే అనుకోవాలి.

ఎందుకంటే అక్కడ ఎక్కువ సంఖ్య థియేటర్లలో విడుదల చేయడం జరిగింది. అందుకోసం చాలా ఖర్చు చేస్తారు. ఆ ఖర్చుతో పోల్చితే ఇది తక్కువే అని చెప్పక తప్పదు. రోబో చిత్రం సంచలన విజయాన్ని సాధించిన తర్వాత ఆ కాంబోలో మూవీ అది కాకుండా 450 కోట్ల బడ్జెట్ అనగానే హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉంటుందని అంతా భావించారు.

కాని సినిమా నిరాశ పర్చింది. చైనా ప్రేక్షకులు అయినా ఈ భారీ విజువల్ వండర్ ను ఆధరిస్తారని భావిస్తే వారు కూడా అంతంత మాత్రంగానే సినిమా ఉందని తేల్చేశారు. లైకా ప్రొడక్షన్స్ వారు పెట్టుకున్న 100 కోట్ల ఆశలు గల్లంతయ్యాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here