5 తలల విలన్…. సెన్సేషనల్ అప్ డేట్ ఇదే! | 123Josh.com
Home న్యూస్ 5 తలల విలన్…. సెన్సేషనల్ అప్ డేట్ ఇదే!

5 తలల విలన్…. సెన్సేషనల్ అప్ డేట్ ఇదే!

0
594

ఈ ఆగస్ట్ 15 కొత్త సినిమాల సందడితో పాటు రాబోయే వాటి పోస్టర్లు టీజర్ల హడావిడితో మూవీ లవర్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉంది. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్మీకి టీజర్ అదే రోజున రాబోతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ రఫ్ లుక్స్ ని రివీల్ చేస్తూ ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది యూనిట్. ఊర మాస్ లుక్ తో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వరుణ్ మాములుగా లేడు.

ఇప్పటిదాకా సాఫ్ట్ రోల్స్ లో లవర్ బాయ్ గా కనిపించిన వరుణ్ ని ఇంత మేకోవర్ లో చూడటం అభిమానులకూ సర్ప్రైజే. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకునే దశలో ఉన్న వాల్మీకి మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేసింది. సెప్టెంబర్ 13న వాల్మీకి విడుదల కానుంది. అదే రోజు నాని గ్యాంగ్ లీడర్ ఉన్నప్పటికీ ఎవరికి వారు రిజల్ట్ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

డిజే లాంటి బ్రేక్ ఇచ్చిన హరీష్ శంకర్ తో పూజా చేస్తున్న రెండో సినిమా ఇదే. తమిళ హీరో అధర్వా మరో కీలక పాత్ర చేస్తున్నాడు. తమిళ్ బ్లాక్ బస్టర్ జిగర్ తండా రీమేక్ గా రూపొందుతున్న వాల్మికి తనకు సరికొత్త ఇమేజ్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు వరుణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here